నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిబ్బంది కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో తనిఖీలు నిర్వహించి గూడ్స్ వ్యాన్ లో తరలిస్తున్న సుమారు రూ.లక్ష విలువైన బియ్యాన్ని సీజ్చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
