24 C
Hyderabad
Sunday, August 2, 2026

బల్దియాలో పంపకాల పంచాయితీ

Must read

📰 Generate e-Paper Clip

  • రెగ్యూలర్ ఉద్యోగిని గెంటేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
  •  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదిరిన వివాదం
  •  ఔట్ సోర్సింగ్ సానిటరి ఇన్స్ పెక్టర్ల పై జవాన్ల తిరుగుబాటు

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదుర్లు రెచ్చిపోతున్నారు. బల్ధియా కమిషనర్ గా ఐఎఏస్ గాపని చేసిన, ర్యాంకర్ అధికారి వచ్చిన ఖాతరు చేయడం లేదు. ప్రధానంగా బల్దియాలో పారిశుధ్య విభాగంలో ఔట్ సొర్సింగ్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆగడాలు ఆగడం లేదు. ప్రతి నెల మామూళ్లు ఇవ్వనిది అది బయట వారు ఐనా, బల్ధియా సిబ్బంది ఐనా వదలడం లేదు. బల్దియాలో ప్రధానంగా పారిశుధ్య విభాగంలోనే పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. వారు కుడా సానిటరి వర్కర్ లుగా చివర వరకు జవాన్ లుగా పనిచేస్తున్నారు. వారిపై పెత్తనం చేస్తున్నది మాత్రం ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్, డిప్యూటేషన్ ల పై వచ్చిన వారు. వారు ప్రతినెల మామూళ్ల కోసం సిబ్బందిని రాచీ రంపాన పెడుతున్నారు. 13 సంవత్సరాలుగా డిప్యుటేషన్ పై పనిచేసిన డియంహెచ్ఓ ఉద్యోగిని సొంత శాఖకు సరెండర్ చేసిన, రెవిన్యూ ఉద్యోగిని తిరిగి తమ హోం శాఖకు బదిలి చేసిన ఆగడాలు ఆగడం లేదు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 55వ డివిజన్ సర్కిల్ లో సానిటరీ జవాన్ వెంకటస్వామి పై సర్కిల్ సానిటరీ ఇన్స్పెక్టర్ తన కార్యాలయం నుంచి మెడపట్టి గెంటేసారు. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. పర్మనెంట్ సానిటరి ఉద్యోగులు ఐదుగురు సిబ్బంది రానప్పటికీ వారి స్థానంలో బదిలీ వర్కర్లను పెట్టుకుంటూ ప్రతినెల రూ.13 వేల రూపాయలు సానిటరీ ఇన్స్పెక్టర్ కి ఇవ్వాలని ఒప్పంధం ఉన్నట్టు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున సర్కిల్ 5 లో అందరి హాజరు అయిన తర్వాత పదిమంది జవాన్లతో సమావేశమైన సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రతినెల డబ్బుల విషయంలో నాకెందుకు ఇవ్వట్లేదు డబ్బులు అని జవాన్లపై ఎదురుదాడికి దిగాడు.. సుమారు వారం 15 రోజుల నుండి పదిమంది జవాన్లను వేధిస్తున్నాడని తెలిసింది. రాని వాళ్ళని కూడా వచ్చినట్టు అటెండెన్స్ వేస్తూ నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఎస్ఐపై ఆరోపణలు వచ్చినప్పటికీ గతంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ సైతం ఓ ప్రత్యేక టీంను ఆరు సర్కిల్లో విభాలుగా స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి ఉదయం 5 గంటలకే సర్కిల్లో అటెండెన్స్ వేస్తూ వారి ఐడి కార్డు తో సహా ఆధార్ కార్డు సైతం తీసుకోవడం జరిగింది. కమీషనర్ వద్ద పని చేసిన వ్యక్తిగత సహయకుడు , కొందరు రాజకీయ పరంగా అండదండలతో మున్సిపల్ సిబ్బంది కాకపోయినప్పటికీ రాజకీయాల తిరుగుతూ మున్సిపల్ సిబ్బంది గా ఐడి కార్డు తీసుకొని గత మూడు సంవత్సరాల నుండి ప్రతి నెల రూ.14,500 చొప్పున ప్రభుత్వానికి గండి కొడుతున్నారు.

అటెండెన్స్ లోనూ మున్సిపల్ అధికారుల హస్తం క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతినెల ఐదవ తేదీ నుండి రెండు రోజుల్లో అటెండెన్స్ వేసే సిబ్బంది నుండి సానిటరీ ఇన్స్పెక్టర్ నుండి పై అధికారుల వరకు మామూలుగా ఇవ్వాల్సిందే. ఇలా గత కొన్ని సంవత్సరాల నుండి సానిటరీ ఇన్స్ పెక్టర్ ల ఆదాయ వనరుగా అటెండేన్స్ ను మలుచుకున్నారు. నగరంలోని అన్ని సర్కిల్లో ప్రతి నెల హజరు విషయంలో పంపకాలు జరుగుతున్నాయి. చాల మంది రెగ్యూలర్ పారిశుధ్య కార్మికులు అనారోగ్యంతో పాటు, వయస్సు పైబడి విధులకు హజరు కాక తమ స్థానంలో ఇతరులను విధులకు పంపడం అనేది జరుగుతొంది. రెగ్యూలర్ , ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ ఉద్యోగులు విధులకు రాకున్న వచ్చినట్లు హజరు వేసి సానిటరి ఇన్స్ పెక్టర్లు ఒకొక్కరు నెలకు రూ.లక్ష వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. విధులకు రాకుండా తమ వంతుకు వచ్చిన వారికి వేతనాలు ఇవ్వడమే కాకుండా ఎస్ఐలకు, జవాన్ లకు నెలకు ఇంతా ఇస్తేగాని వేతనం విడుధల చేయరు. ఇటివల గత ప్రభుత్వం హయంలో నియమితులైన పారిశుధ్య సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారు అనేది కమీషనర్, డిప్యూటి కమీషనర్ లతో పాటు మేనేజర్ లకు తెలియని పరిస్థితి. ఇక్కడ ప్రతినెల రెగ్యూలర్ ఉద్యోగుల కంటే తక్కువ వేతనం మామూళ్లు ఎక్కువగా తీసుకునేవారు ఎవ్వరు అంటే ఔట్ సోర్సింగ్ ఇన్స్ పెక్టర్లే.

More articles

Latest article