27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

స్టేట్ లెవల్ హకీ క్రీడలకు పల్లికొండ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని జడ్పిహెచ్ ఎస్ పల్లికొండ కు చెందిన విద్యార్థులు స్టేట్ లెవల్ హకీ క్రీడలకు ఎంపికయ్యారు. ఈ నెల 23న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ జీ ఎఫ్ అండర్ 14 బాల బాలికల హకీ క్రీడాకు గాను శ్రీనాథ్, గంధం నక్షత్రలు ఎంపికవ్వగా, స్టాండ్ బాయ్ గా గంధం ప్రనీతలు ఎంపికయ్యారు. ఈ ఎంపిక క్రీడాకారులు ఈ 29,30 న డిసెంబర్ 1 న హుజూరాబాద్ లో జరుగనున్న స్టేట్ లెవల్ హకీ టోర్నమెంట్ లో ఆడానున్నారని హెడ్ మాస్టర్ అనురాధ, పీ. డీ చిన్నయ్య లు తెలిపారు. ఈ నెల 20న ఆర్మూర్ లో జరిగిన అండర్ 19 ఎస్ జీ ఎఫ్ బాల బాలికల హకీ క్రీడాలో రాము, రేవంత్, అఖిల, అనన్య లు ఎంపికైనట్లు వారు తెలిపారు. వీరు కూడా త్వరలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్టేట్ లెవల్ హకీ టోర్నమెంట్ లో ఆడానున్నట్లు వారు వివరించారు. ఈ స్టేట్ లెవల్ హకీ టోర్నమెంట్ కు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్థానిక వీడీసీ, గ్రామ ప్రజలు అభినందించారు.

More articles

Latest article