రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో కొనసాగుతున్న అఖండ హరినామ సప్తహ శుక్రవారం నాటికి ఏడవ రోజుకు చేరింది. అఖండ హరినామ సప్త కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రధాన వీధుల గుండా భజనలు, కీర్తనలతో పల్లకి సేవ నిర్వహించారు. అలాగే శనివారం కాలకీర్తన అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.