బతుకమ్మ, నందిపెట్ : డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో సి ఎం రేవంత్ రెడ్డి, పి సి సి మహేష్ కుమార్ గౌడ్ ల చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేసి తమ ధన్యవాదలు తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 బోనస్ పథకాలు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ వై.ఎస్. గంగాధర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని చెప్పారు. మాజీ సర్పంచ్, డొంకేశ్వర్ మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు దశ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల లోని రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ సిలిండర్ అందిస్తూ ప్రజా పాలన లో జనాభ ప్రాతిపాదికన ప్రతి ఒక్కరి తమ వాటాను కల్పించడానికి కుల గణన సర్వే చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగారాం, జెల్ల రాజన్న. డొంకేశ్వర్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

