బతుకమ్మ, పిట్లం : పిట్లం పట్టణ, మండల పద్మశాలి కార్యవర్గాన్ని ఆదివారం ఆర్య సమాజ్ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షునిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా హన్మండ్లు, కార్యదర్శిగా అరవింద్ను నియమించారు. మండల అధ్యక్షునిగా బాలరాజు, ఉపాధ్యక్షునిగా పండరి, మిగిలిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.