29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అడ్డంకులు అధిగమించి సోనియా రాష్ట్రం ఇచ్చారు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం వర్చువల్ గా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈసందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ  సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభి వద్ధిలో రాష్ట్రం నంబర్ 1 గా రూపొందుతుందన్నారు. 2009 లో ఇదే రోజు  తెలంగాణ ప్రకియ ఏర్పాటు ప్రారంభమైందని,  తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవెర్చిందన్నారు.  ఏటా తెలంగాణ  తల్లి  అవతరణ దినోత్సవాలతో పాటు సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలను ప్రజలు జరుపుకుంటారన్నారు.  సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతుందన్నారు.  రాష్ట్రంలో ని 33 కలెక్టరేట్లలో 5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article