ముత్యాల చెరువుతో మా గ్రామానికి ముప్పు
రోడ్డు పై బైఠాయించిన వాడి గ్రామస్తులు ముత్యాల చెరువు కట్టేందుకు సర్వే కోసం వచ్చారని ఆందోళన అలాంటి సర్వే ఏమి లేదని పోలీసుల వివరణ ధర్పల్లి, బతుకమ్మ : ముత్యాల చెరువుతో తమ గ్రామానికి ముప్పు ఉందని ధర్పల్లి మండలంలోని వాడి గ్రామస్తులు నిరసనకు దిగారు. గత వారం కురిసిన వర్షాల వల్ల ముత్యాల చెరువు తెగిపోయి తమ గ్రామానికి నష్టం వాటిల్లిందని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ముత్యాల చెరువు తెగి పోయి ఇల్లు, వాకిలి ఏమి మిగలకుండా ఆస్తి నష్టం, పంట...