24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు 

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శనివారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పశుఘన అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధులకు 20 కృత్రిమ గర్భధారణ, 2 సాధారణ చికిత్సలు, 13 నట్టాల నివారిణి 22 మొత్తం 55 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రుద్రూర్ మండల పశువైద్యాధికారి డా. సంతోష్ మాట్లాడుతూ. ఉచిత గర్వకోశ వ్యాధుల చికిత్స శిబిరము సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ యొక్క చలికాలంలో గేదెలు ఎదునుకు వస్తాయి కావున సకాలంలో ఎదను గుర్తించి అందుబాటులో ఉన్న గోపాల మిత్రుల ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే మంచి మేలు జాతి దూడలు పుడతాయని పేర్కొన్నారు. అధికంగా పాలనిస్తాయని మండల పశువైద్యాధికారి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల పశువైద్యాధికారి సిహెచ్ సురేష్, పశుసహాయకులు సాయిరాజ్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్ర హనుమండ్లు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article