29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:మెండోర పోలీస్ స్టేషన్ లో  పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. పోలీసుల విధులు,ఆయుధాలు, రికార్డుల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసుల విధులపై ఎస్సై మెండోరా మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి అవగాహనా కల్పించారు. పోలీస్ స్టేషన్ సందర్శన అనేది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల పనితీరు ఉపయోగించే సాంకేతికతలు  ప్రజలకు అందించి సేవలు గురించి అవగాహన కలిపించారు. కార్యక్రమoలో  పోలీసుల రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయుధాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై సమాచారం అందించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల రోజువారి విధులు, భద్రత చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు తెలియజేయడం, డయల్ 100, షీ టీమ్స్ మరియు సైబర్ నేరాల నివారణ వంటి వాటిపై అవగాహన కల్పించడం. ప్రజలు పోలీసులతో నేరుగా మాట్లాడేందుకు వారి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం కార్యక్రమాలలో భాగంగా జరిగే అంశాలు రైటర్ పనితీరు, కేసు డైరీ వంటి అంశాలను వివరిoచారు. అలాగే సీసీ కెమెరాలు, విహెచ్ఎఫ్ సెట్ వంటి పరికరాలను ఉపయోగించే ఆయుధాలు వాటిని ఎలా భద్రపరుస్తారు. దాని గురించి క్లుప్తంగా వివరించారు. మైనర్ డ్రైవింగ్ మోటార్ వాహనాల చట్టాలు, ఇతర బందోబస్తు గురించి తెలియజేశారు. విద్యార్థులు నేరుగా ఎస్సై వంటి అధికారులతో మాట్లాడి ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం మెండోర మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article