తెలంగాణ వర్సిటీలో ఎన్ఈపీ పై (ఆన్లైన్) ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం, ఆర్ & డి సెల్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సహకారంతో “ఎన్ఈపీ ఓరియెంటెషన్ & సెన్సిటైజేషన్” అనే అంశంపై మార్చి 12 నుండి మార్చి20 వరకు ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5.00 నుండి 8.15 గంటల వరకు జూమ్...