25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా  రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో ఆదివారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి  ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నరేందర్ రెడ్డిని గెలిపించుకోవటం వలన మన వాక్కును మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఉద్యోగాలు, అనేక యువతకు సంబందించిన పథకాలు సాధించుకుందామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో రుద్రూర్ మండల యూత్  అధ్యక్షులు నితిన్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బట్టు నాగయ్య, రెంజర్ల  గంగారాం, కొండ. సుదర్శన్ గౌడ్, గాండ్ల రమేష్, దువ్వ రామదాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article