కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రచారం

రుద్రూర్, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా  రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో ఆదివారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి  ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నరేందర్ రెడ్డిని గెలిపించుకోవటం వలన మన వాక్కును మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఉద్యోగాలు, అనేక యువతకు సంబందించిన పథకాలు సాధించుకుందామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో రుద్రూర్ మండల...