25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లింబాద్రి గుట్ట జాతరకు వన్ వే ట్రాఫిక్ రూల్

Must read

📰 Generate e-Paper Clip

  • కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
  • భక్తులు నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలి
  • భీమ్ గల్ సీ.ఐ సత్యనారాయణ

 

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనృసింహాస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈసారి వన్ వే ట్రాఫిక్ సిస్టంను అమలు చేస్తున్నట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం లింబాద్రిగుట్ట కల్యాణ మండపం వద్ద ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీ ఐ మాట్లాడుతూ గుట్టపైకి జాతరకు  వెళ్లే సమయంలో వన్ వే రూట్ లో భాగంగా ఎంట్రీ భీమ్ గల్ నుండి పురానిపేట్ టు లింబాద్రిగుట్టకు వెళ్లాలని, తిరుగు ప్రయాణంలో లింబాద్రి గుట్ట నుండి పల్లికొండ మీదుగా లింగపూర్, సిద్దపల్లి గ్రామాల నుండి భీమ్ గల్ కు ఎగ్జిట్ రూట్ ను భక్తులు అనుసరించాలని సీ ఐ తెలిపారు. భారీ వాహనాలకు భక్తుల వాహనాలు నడిచే వన్ వే గుండా కాకుండా పల్లికొండ, పిప్రి మీదుగా బెజ్జోరా నుండి భీమ్ గల్ కు హెవీ వెహికల్ రూట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం జాతర సమయంలో భక్తుల వాహనాలు ఒకే మార్గం గుండా రాకపోకలు నిర్వహించడం కారణంగా కొంత అసౌకర్యం జరిగిన దరిమిలా ఈ వన్ వే రూట్ సిస్టమ్ ను అమలు చేస్తున్నట్లు సీ ఐ వెల్లడించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు,జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి పోలీస్ సిబ్బందికి సహకరించాలని సి ఐ భక్తులను కోరారు. ప్రెస్ మీట్ లో వీడీసీ ప్రెసిడెంట్ నీలం రవి, వైస్ ప్రెసిడెంట్ మోహన్ లు పాల్గొన్నారు.

More articles

Latest article