. . . బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
జీవన పయనంలో ప్రతి వ్యక్తికి గురువులు ఉంటారని, వారిని ఆదర్షంగా న్యాయవాద వృత్తిలో ఎదగాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు శివ మంగల్ సింగ్, మదన్ లాల్ గుప్తా అన్నారు. గురుపూర్ణిమ వారోత్సవాల సందర్బంగా నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి కృష్ణానంద్, రాజ్ కుమార్ సుబేధార్ జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రతినిధులు బృందం కలిసి సీనియర్ న్యాయవాదులు శివ మంగళ్ సింగ్, మదన్ లాల్ గుప్తా లను వారివారి నివాసాలలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా తో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరంతర అధ్యయనం, లేటెస్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు ల తీర్పులను వంటబట్టీచ్చుకోవాలని పేర్కొన్నారు. న్యాయవాదుల ముందుకు వచ్చే ప్రతి కేసు పైల్ ను క్షుణంగా చదివి, డ్రాప్టింగ్ చేసుకోవాలని తెలిపారు. పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత 60 సంవత్సరాలుగా సీనియర్ న్యాయవాదులు సేవలందించడం అభినందనీయమని, గురువు లేనిదే జ్ఞానం లేదని, మన అజ్ఞానాన్ని పోగొట్టి మంచి మార్గాన్ని చూపించేవారు గురువని, గురుపూర్ణిమ నేపథ్యంలో గురువులను స్మరించుకోవాలనే తలంపుతోనే సీనియర్ న్యాయవాదుల గౌరవించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి కృష్ణానంద్ సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, సుదర్శన్ రెడ్డి పిల్లి శ్రీకాంత్, జయప్రకాశ్ లోయ, శరత్ చంద్ర, తదితరు న్యాయవాదులు పాల్గొన్నారు.

