29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి, రోడ్డు ప్రమాదంలో మరోకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఉసికే పోశెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డాడని బుధవారం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా రుద్రూర్ బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం అతివేగంగా, అజాగ్రత్తగా ఆర్టీసీ బస్సు నడిపి కార్ కు ఢీ కొట్టడంతో, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి రూ.1000 జరిమానా,  ఒకరోజు జైలు శిక్ష  విధించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

More articles

Latest article