బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆంజనేయులు టోల్ ప్లాజా సమీపంలో జరిపిన వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టగా ఓరుగంటి విజయ్ కుమార్ తిప్పాపూర్ వ్యక్తికి సోమవారం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష తో పాటు 200 రూపాయలు విధించారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించారు.
