బతుకమ్మ, భిక్కనూరు: ఇంటి గోడ కూలి మృతి చెందిన ఘటన బిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దూదాన్ని జాకీర్ సింగ్(36) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతను ఉంటున్న ఇల్లు గోడలు తడిచి ఉండడంతో అతను ఇంటి వెనకాల కాలకృత్యాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మృతి చెందాడని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతి చెందిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించడం జరిగిందన్నారు.

