రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన రుద్రజాడ రవీందర్ (48) అను వ్యక్తి ఏదో గుర్తు తెలియని గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ నగర్ గ్రామానికి చెందిన మృతుడు రుద్రజాడ రవీందర్ కూలి పని చేసుకుంటూ జీవించేవాడని, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. అతిగా మద్యం త్రాగే అలవాటు ఉంది. మద్యానికి బానిసై వచ్చిన కూలీ డబ్బులు సరిపోకపోవడంతో ఇంట్లో భార్యతో డబ్బులు ఇవ్వమని మద్యం కొరకు గోడవ పడేవాడు. అదే క్రమంలో ఈ నెల తేదీ 14 శుక్రవారం హోలీ పండుగ రోజున అతిగా మద్యం తాగి వచ్చి ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో ఏదో గుర్తుతెలియని గడ్డి మందు తాగి పడిపోయినాడు. వెంటనే అతని భార్య చికిత్స కొరకు 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నుండి చికిత్స పొందుతూ తేదీ 15 శనివారం రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో చనిపోయినాడని, ఆదివారం మృతుని భార్య సుహాసిని ఫిర్యాదు ఇవ్వగా రుద్రూర్ ఎస్ఐ పి. సాయన్న కేసు నమోదు చేసుకున్నారు.
