26.2 C
Hyderabad
Monday, August 3, 2026

చెరువులో దూకి ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండల కేంద్రానికి చెందిన పిట్లం జంగం విట్టల్ (37) చెరువులో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన జంగం విట్టల్ కూలి పని చేసుకుంటూ జీవించే వాడు. కొంత కాలంగా ఆర్థక పరిస్థితి బాగాలేక తాగుడుకు బానిస అయ్యాడు. ఈక్రమంలో గ్రామ శివారులోని మారేడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

More articles

Latest article