29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రుద్రూర్ ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని సీసీ కెమెరాలతో దొంగతనాలను అరికట్టవచ్చని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. మన ఊరు – మన భద్రత – మన అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో  ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సీసీ కెమెరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన కూడలిల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని సూచించారు.  అదేవిధంగా మాదకద్రవ్యాలు, రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే డీజే  అవాంతరాలను అరికట్టడానికి, మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించడానికి ఒక తీర్మానం చేయడం పేర్కొన్నారు. రహదారి భద్రతను పెంపొందించడానికి ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను అతికించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సురక్షితం కాని అరిగిపోయిన చక్రాలతో ట్రాక్టర్ల రాకపోకలను నివారించడం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగమ్మ గంగారాం, అనిల్ పటేల్, గ్రామ పెద్దలు,  గ్రామస్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

One CCTV camera is equal to 100 police officers

More articles

Latest article