29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వరదలో చిక్కుకున్న రైతును కాపాడిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ :  రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న  విషయం తెలిసిందే. ఇందల్వాయి మండలంలో  బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి డోన్కల్ గ్రామ శివారులో కట్టతెగి పోవడం వల్ల పొలాల్లోకి నీళ్లు వచ్చి డొంకల్ తాండ గ్రామానికి చెందిన నునావత్(60) వరదలో చిక్కుకోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో  పోలీసు సిబ్బంది,ఫైర్ సిబ్బంది,ఎన్టీఆర్ఎఫ్ బృందాలు  వరదలో చిక్కుకున్న రైతును  కాపాడారు. రోజువారిగా పంట పొలాలలో పని  చేసుకోవడానికి వెళ్ళినందున పంట పొలాల్లో  ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం ఉదృతంగా రావడంతో వరదలు చిక్కుకున్న అతనిని పోలీస్, ఫైర్ సిబ్బంది మరియు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సాయంతో రక్షించి డొంకల్ తండా గ్రామస్తులకు  వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగిందని ఎస్సై సందీప్ తెలిపారు.

Officials rescue farmer trapped in flood

More articles

Latest article