నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. నగరంలోని ఖలీల్వాడిలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న నర్సింగ్ విద్యార్థిని (19) హాస్టల్ గదిలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు విద్యార్థినిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి వేధింపులే కారణమని తెలిసింది. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయంపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ వివరణ కోరగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వాస్తవమేనని చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థిని కోలుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
