27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థుల చదువుకు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ చేయూత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్  గ్రామానికి చెందిన సిద్దార్థ 3వ తరగతి, కృతిక్ కుమార్ 4వ తరగతి, నైనిక యూకేజీ, విగ్నేష్ 2వ తరగతి, ప్రన్వీత్ 3వ తరగతి, నిఖిలేశ్వరి 7వ తరగతి, శ్రీధన్య 1వ తరగతి, ఏడుగురు విద్యార్థులు బోధన్ లోని ఆచార్య విద్యాలయంలో చదువుతున్నారు. వారి చదువు కొరకు రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ  బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ని సహాయం అడగగా, కోనేరు శశాంక్ వెంటనే స్పందించి  విద్యార్థులకు తక్షణమే ఒక సంవత్సరానికి 7 గురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు, నోట్ బుక్స్ కొరకు అయ్యే మొత్తం ఖర్చును 40,000  వేల రూపాయలు స్కూల్ యాజమాన్యానికి అందించి వారికి పుస్తకాలు నోట్ బుక్స్ ఇప్పించడం జరిగింది. గత సంవత్సరం కూడా ఈ విద్యార్థులకు శశాంక్  పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులు అని  విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వారి చదువుకి ముందు ముందు కూడా అండగా ఉంటానని వారి తల్లి తండ్రులకి శశాంక్  భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, సిద్దాపూర్ గ్రామ ప్రజలు, ఆలపాటి హరికృష్ణ, బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బాన్సువాడ నియోజకవర్గంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article