30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

షబ్బీర్ అలీ కి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై నోటిసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్

 

కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లా లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రచ్చ రచ్చవుతుంది. పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘీంచారని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీకి పిసీసీ నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం పిసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ రాజకీయాలలో విబేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. షబ్బీర్ అలీ, టిపిసీసీ జనరల్ సెక్రేటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో గత వారం గడ్డం చందుకు పార్టీ క్రమ శిక్షణ సంఘం షోకాజ్ నోటిసులు ఇవ్వడం, ఆయన క్రమ శిక్షణ సంఘం ఎదుట హజరై తన సంజాయిషి ఇచ్చుకున్నారు. ఆ వివాదం సమసి పోక ముందే ఇటీవల మాజీ మంత్రి, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ ఫోన్ ఆడియో లీకై వైరల్ అయింది. అది చాలదన్నట్టు షబ్బీర్ అలీ వర్గీయులు సోషల్ మీడియాలో కామారెడ్డి కాంగ్రెస్ నేతను ఉద్దేశించి రాసిన అభ్యంతరకర పోస్టులు వైరల్ అయ్యాయి. దానిపై స్థానికంగా కాంగ్రెస్ మహిళ నేత షబ్బీన్ అలీ పై ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆగమాగమైంది. పార్టీ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘించాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో క్రమ శిక్షణ ఉల్లంఘన అనేది పరిపాటిగా మారింది. సస్పెన్షన్ లు, తిరిగి పార్టీలో చేరడం షరా మామూలు అయ్యాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి జిల్లాలో కురు వ్రుద్ధనేతగా ఉన్న షబ్బీర్ అలీకి పార్టీ క్రమ శిక్షణ నోటిసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. షబ్బీర్ అలీ ఇచ్చే వివరణ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే చర్చ జరగుతుంది. ఈ షోకాజ్ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ క్రమ శిక్షణను దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

. . . పది మంది కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు

కామారెడ్డి జిల్లాలో పది మంది కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ తన గురించి ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో అభ్యతంరకర వ్యాఖ్యలను రాసి సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై ప్రధాన సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కు ఫిర్యాదు చేసింది.  మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు గడ్డం ఇందుప్రియ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేశారని పది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై బీఎన్ఎస్ ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More articles

Latest article