27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తర తెలంగాణ ఉడుకుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండో రోజు నిజామాబాద్ లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు

 

. . . ఈ సారి నిజామాబాద్ జిల్లాలో కొత్త రికార్డులు ఖాయమే

 

 నిజామాబాద్, బతుకమ్మ :

 

ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్తే ప్రవేశానికి ముందే రోళ్లు పగిలేలా ఎండలు దంచుతున్నాయి. నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, పెద్ధపల్లి, జగిత్యాల జిల్లాలలో గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా మెండొరాలో 46, డిచ్ పల్లిలో 45.9 డిగ్రీల గరిష్టంగా ఎండలు దంచి కోట్టాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల లో 45.6, నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ లో 46, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.5, సిద్దిపేట జిల్లా పోతారెడ్డి పేటలో 45.2డిగ్రీల గరిష్టంగా, పెద్ధపల్లి జిల్లా మంథని,  జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డుతో పాటు వెడి వడగాల్పులు వీచాయి. రాష్ట్ర రాజదానిలో చార్మినార్, హీమాయత్ నగర్ 42.5 డిగ్రీల ఎండలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వనపర్తి జిల్లా చిన్నంబావిలొ ఆత్యల్పంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు ఎండాకాలం ఎండలు దంచికొడుతున్న సందర్బంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం మినహ బయటకు రావద్దని వడ దెబ్బల బారీన పడవద్దని సూచిస్తున్నారు….

 

North Telangana is boiling.

 

ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో సోమవారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో45.5నమోదయింది. ఇవాళ కూడా నిజామాబాద్ నగరంతో పాటు మెండోరా,  మాక్లూర్,  ఏర్గట్ల,  మోపాల్,  ధర్పల్లి,  నిజామాబాద్ రూరల్ మండలంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 10 నుండి సాయంకాలం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారత దేశం నుండి వీచే గాలులతో పాటు విదర్భ నుండి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖాధికారులు.. జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సీయస్ గా ఉంది. ఈ సారి ఎండకాలంలో కొత్త రికార్డులు నమోదు ఖాయమని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వడ దెబ్బల బారిన పడు ఇద్ధరు రైతులు ప్రాణాలు వదిలారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

North Telangana is boiling.

More articles

Latest article