. . . మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సిఐటియు ,ఏఐటీయూసీ వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ,ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు రమేష్ బాబు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఓమయ్య మాట్లాడుతూ ప్రధానంగా కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలను చెల్లించాలని అదేవిధంగా కార్మికులందరికీ చెప్పులు, సబ్బులు, నూనెలు, రెండు జతల బట్టలు ఇవ్వాలని అదేవిధంగా చీపుర్లు, పారలు, పనిముట్లను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పండగ సెలవులు, జాతీయ సెలవులను అమలు జరపాలని ,ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి నేరుగా వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 1181 ఉపసంహరించుకోవాలని రెండవ పిఆర్సి ని ప్రకటించ కనీస వేతనం 26000 అమలు జరపాలని, సరెండర్ లీవ్ డబ్బులను చెల్లించాలని మెకానిక్ షెడ్ ను ఏర్పాటు చేయాలని, చనిపోయిన కార్మికులకు 30 వేల రూపాయలు దహన సంస్కారాలకు చెల్లించాలని ,వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పై పని భారం తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ 15 రోజుల్లో కార్మికులకు ఇవ్వాల్సిన బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలను, అందజేస్తామని ,మెకానిక్ షెడ్డు ను ఏర్పాటు చేస్తామని 5వ తేదీ లోపు వేతనాలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వేతనాల పెంపుదల , కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రభుత్వానికి రాస్తామని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భూపతి, సుర రవి ఏఐటీయూసీ నాయకులు రాజశేఖర్ , చిన్ను భాయ్ లలిత మరియు కార్మికులు పాల్గొన్నారు.
