24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : .నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-2026 వార్షిక ఎన్నికల నిర్వహించడానికి వీలుగా సీనియర్ న్యాయవాదులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ లను నియమిస్తు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ చైర్మన్ ఆకుల రమేష్ సభ్యులు బాస రాజేశ్వర్,జి.నరసింహ రెడ్డి, శ్రీహరి ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి ఆదేశానుసారం వారికి ఎన్నికల అధికారుల నియమాకాల పత్రాలు అందజేసినట్లు వారు తెలిపారు.న్యాయవాదుల ఓటరు జాబితా, ఎన్నిక షెడ్యూల్ వారు విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులుగా నియమాకాల పత్రాలు స్వీకరించిన అనంతరం వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ బార్ సమావేశపు హల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బార్ కౌన్సిల్ పంపించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఓటరు జాబితాతో పాటు ఎన్నికల షెడ్యూల్ అడ్ హాక్ కమిటీ ద్వారా స్వీకరించినట్లు తెలియజేశారు.ఓటరు జాబితాను బార్ నోటీస్ బోర్డ్ పై డిస్ప్లే చేసినట్లు తెలిపారు. మార్చి 22 నుండి 26 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని అన్నారు. మార్చి 27 న నామినేషన్ పత్రాల పరిశీలన ,28 న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వారు స్పష్టంచేశారు. ఏప్రిల్ 4 న ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ అనంతరం పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించడం జరిగుతుందని వారు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి,క్రీడా కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, కోశాధికారి పదవులతో పాటు కార్యవర్గ సభ్యుల పదవులకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తామని వెంకటేశ్వర్,గౌడ్ తెలిపారు.

More articles

Latest article