27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ విజయపథం

Must read

📰 Generate e-Paper Clip

  • సీబీఎస్ఈ బోర్డు నుండి గుర్తింపు ఒక గొప్ప ఘనత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని నిషిత ఇంటర్నేషనల్ పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు నుండి గుర్తింపు లభించింది అని నిషిత పాఠశాల ప్రెసిడెంట్ చౌడవరం వినయ్ కుమార్, చైర్మన్ నిఖిల్ చౌడవరం, డైరక్టర్ పూజా చౌడవరమ్, కో- ఆర్డినేటర్ చౌడవరం రాజు లు సోమవారం తెలిపారు. నిజామాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థలలో అగ్రగామిగా నిలిచిన నిశిత విద్యా సంస్థలు గత 31 ఏళ్లుగా విశిష్టమైన విద్యాసేవలను అందిస్తూ విద్యారంగంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. అదే ప్రస్థానంలో భాగంగా నిశిత ఇంటర్నేషనల్ స్కూల్, నిజామాబాద్ 2024 జూన్ నెలలో ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే, కేవలం ఒకటిన్నర సంవత్సర -కాలంలో, ఈ పాఠశాల పొందడం జిల్లా సీబీఎస్ఈ బోర్డు నుండి గుర్తింపు ఒక గొప్ప ఘనతగా నిలిచింది. ఇటివలే ఈ పాఠశాల సీబీఎస్ఈ అఫిలియేషన్ నంబర్ 3630571 అధికారికంగా అందుకుంది. ఈ విజయానికి పాఠశాల చీఫ్ ప్యాట్రన్ చౌడవరం వినయ్ కుమార్, చైర్మన్ నిఖిల్ చౌడవరం, డైరక్టర్  పూజా చౌడవరమ్, కో- ఆర్డినేటర్ చౌడవరం రాజు అందించిన మార్గదర్శకత, అంకిత భావం ప్రధాన కారణమని పాఠళాల ప్రతినిధులు తెలిపారు .నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తూ, సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది.

More articles

Latest article