29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నిమ్మలపూజ

Must read

📰 Generate e-Paper Clip

 

ఆర్మూర్, బతుకమ్మ : 

 

ఆర్మూర్ పట్టణంలో 25వ వార్డ్ కు చెందిన నిమ్మల జలంధర్ యాదవ్ సతీమణి నిమ్మల పూజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిరుమల్ల రాకేష్, పిప్రి సర్పంచ్ కిరణ్, పోల సుధాకర్, అభిలాష్, రంజిత్, చిన్న రామ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article