ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య

0 10,000

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పెళ్లయిన రెండు నెలలకే నవ వధువుకు నూరేళ్లు నిండాయి. ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బీబీపేట మండలం జనగామ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన అనూషకు జనగామ గ్రామానికి చెందిన నవీన్ తో రెండు నెలల క్రితం వివాహమైంది. రెండు నెలల పాటు భార్యభర్తలు బాగానే ఉన్నారని, పొలం పనుల నిమిత్తం బుధవారం భర్త నవీన్ బయటకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనూష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయి రెండు నెలలు కూడా కాకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో కలకలం రేపింది. అయితే అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేక ఆత్మ హత్యకు పాల్పడిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.