నిజామాబాద్, బతుకమ్మ : టీజీఈజేఏసీ జిల్లా నూతన కార్యవర్గం శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతుని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈసందర్భంగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుమన్, కన్వీనర్ కిషన్, రమణ్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కృపాల్ సింగ్, రాము, మోహన్ రెడ్డి, కృష్ణా రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
