30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సీపీని కలిసిన నూతన ఎస్ఐలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్ఐలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను పువ్వుల మొక్క ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా విదులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. వారందరికి తగు న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను నిఖచ్చిగా అమలుచేయాలని అన్నారు. ప్రతీ విషయం తమ పై అధికారులకు తెలియజేయాలని, ప్రతీ గ్రామాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానంగా సైబర్ నేరాల పై, కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు. పోలీస్ కమిషనర్ ని కలిన వారినలో ధర్పల్లీ ఎస్ఐ ఎం.కళ్యాణి, మోపాల్ ఎస్ఐ సుస్మిత, ఎడపల్లి ఎస్ఐ ఎం.రమ, బాల్కొండ ఎస్ఐ కె.శైలేందర్, మెండోరా ఎస్ఐ సుహాసిని, ఏర్గట్ల ఎస్ఐ పి.రాజేశ్వర్, మూడో టౌన్ ఎస్ఐ కిరణ్ పాల్  ఉన్నారు.

More articles

Latest article