సీపీని కలిసిన నూతన ఎస్ఐలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్ఐలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను పువ్వుల మొక్క ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా విదులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. వారందరికి తగు న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను నిఖచ్చిగా అమలుచేయాలని...