నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మారుతున్న కాలానికనుగుణంగా, రాబోవు కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఈ సంవత్సరము విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే గ్రూపులను తీసుకొని రావడం జరిగిందని కేర్ డిగ్రీ కళాశాల డైరక్టర్ నరాల సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేర్ డిగ్రీ కాలేజీ గత 21 సంవత్సరాల నుండి అత్యుత్తమమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేస్తూ అటు ఆటల్లో రాణిస్తూ అంతర్జాతీయ క్రీడాకారాలను తయారుచేసిన విద్యాసంస్థ కేర్ డిగ్రీ కాలేజీ అని ఆయన అన్నారు. బిఎస్సీ ఎంఎల్టి, బిఎస్సి డిజిటల్ మార్కెటింగ్, బిఎస్సి న్యూట్రిషియన్, బిఎస్సి డాటా సైన్స్, బిఎ (హెచ్ఈపి)లు కొత్త కోర్సులతో పాటు బిబిఎ, బిసిఎ, బిఎస్సి బిజెడ్సి, అన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, కళాశాల ఇన్ చార్జిలు సందేశ్ సందీప్, కిరణ్ లు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు స్టేషన్ రోడ్ వద్ద ఉన్న కేర్ డిగ్రీ కాలేజీ ని కానీ లేదా 9949925676, 9951382993, 9949460640 నెంబర్ లను సంప్రదించాలన్నారు.
