30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

12 మండలాలకు బీజేపీ నూతన అధ్యక్షులు

Must read

📰 Generate e-Paper Clip

– ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ అధ్యక్షుడు దినేశ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలోని 12 మండలాలకు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

బోధన్ నియోజకవర్గంలోని బోధన్ రూరల్ మండలానికి సిర్ర సుదర్శన్, నవీపేట్ కు ద్యాగ సరీన్, సాలూరాకు రావుబా గంగాధర్, బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులోటి గోపీకిషన్ నియమితులయ్యారు.

అలాగే బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల అధ్యక్షుడిగా అంబటి నవీన్ కుమార్, వేల్పూర్ కు బేల్దారి నవీన్, కమ్మర్ పల్లికి బద్దం రమేశ్ రెడ్డి, భీమ్ గల్ రూరల్ కు ఆరె రవీందర్, మోర్తాడ్ కు తాతగారి శివానంద్, మెండోరాకు మార ముత్తెన్న, ముప్కాల్ కు గడ్డం సంతోష్ రెడ్డి, ఏర్గట్ల మండలానికి నాయకుడు గంగాధర్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.

New BJP presidents for 12 mandals

More articles

Latest article