- టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అధికారిపై ప్రజావాణిలో ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్టీసీ ప్రజాధనం రెండు కోట్లు వృధా చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్యామ్ రావు పై, విద్యుత్ అధికారి ఏడి తోట రాజశేఖర్ పై చర్య తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్ కు ఆకుల పాపయ్య, శ్రావన్, రవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు 33 కెవి లైన్ వేయుటకు ప్రభుత్వం ఆమోదించిన 100 ఫీట్ల రోడ్డులో కాకుండా 60 ఫీట్ల (ప్రతిపాదిత) రోడ్డు ఎన్నో వంకలుగా ఉన్న ప్రైవేటు వారి స్థలము సూచించి ఆర్టీసీ వారికి సుమారు రెండు కోట్ల భారం పడేటట్టు చూసిన టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్ పై చర్య తీసుకోవాలని కోరారు. బాధ్యత కలిగిన అధికారి నగరంలో ఏ రోడ్లు ఎంత ఉన్నవి, తన దగ్గర మ్యాపులు ఉన్నాయా లేదా పరిశీలించకుండా బాధ్యత రహితంగా వ్యవహరించాడన్నారు. ఇతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఆపాలని కోరారు. దీనిపై విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ శాఖ అధికారి ఏడి తోట రాజశేఖర్ 100 ఫీట్ల రోడ్డులో తనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారని, ఇంకా ఆమోదం కానీ 60 ఫీట్ల రోడ్డులో బలవంతంగా ప్రజలు కష్టపడి కొనుకున్న ప్రైవేట్ స్థలాల నుండి భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్తు 33 కెవి లైన్ వేయిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పిన వినకుండా పనిచేయిస్తున్నాడని తెలిపారు. ఇతనిపై చర్య తీసుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ శాఖ A.E పైన కూడా చర్య తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో కలెక్టర్, నిజాంబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి మెమొరండం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల బాధితులు, కృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
