కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర విఆర్ఓ ల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నీరడి శాంతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం పట్టణంలో బుధవారం జరిగిన వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలలో ఎన్నుకున్నారు. కామారెడ్డి బిసి వెల్ఫేర్ కార్యాలయంలో శాంతయ్య జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి నాయకత్వంలో వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్ర ఆధ్వర్యంలో తనను ఎన్నుకున్నందుకు శాంతయ్య కృతజ్ఞతలు తెలిపారు .తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి వీఆర్వోల సమస్యల సాధనకై అహర్నిశలు కృషి చేస్తానని తన వెన్నంటి ఉన్న అందరూ ఉద్యోగులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
