ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా శనివారం ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు తయారు చేసి, పాఠశాలలో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రాజెక్టులు చూసిన సందర్శకులు ప్రశంసించారు. ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మాతాజీ లు సోనాలి, శైలజ, మంజుల, సింధుజ, లత, వనిత, ప్రియాంక , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

