. . . ఇంచార్జి జిల్లా జడ్జి హరీష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
మానవ సమాజంలో మనుషులమన్నాక మంచి,చెడులను విశ్లేశించుకుని మసలుకోవాలని నిజామాబాద్ ఇంచార్జి జిల్లాజడ్జి హరీష అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయసేవ సదన్ లో సహచర న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి,న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధాలతో కలిసి ఆమె జాతీయ లోక్ అదాలాత్ ను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయసిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. మనుషులలో మంచి అనే విచక్షణ లోపించినప్పుడు నేరాలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. అవి దీర్ఘాకాలం మానవ సమూహల మధ్య మానవ సంబంధాలు దెబ్బతినడానికి అవకాశం ఉన్నదని, మానవ సంబంధాలు కొనసాగాడానికి లోక్ అదాలాత్ లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.రాజీకి వీలున్న క్రిమినల్ కేసులను రాజీ పద్ధతిన పరిష్కరించడంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ క్రీయాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆమె వివరించారు. కలిసిమెలిసి కొనసాగుతూ జీవించడంలోనే మనుషుల జీవితానికి సార్ధకత లభిస్తుందని అన్నారు. కక్షలుకార్పణ్యాలతో కాలం విలువ హరించుకుపోతుందని జడ్జి హరీష అన్నారు.అదనపు జిల్లా జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అందరం కలిసే జీవిస్తామని కొన్ని సందర్భాలలో తగ్గడం మరికొన్ని సందర్భాలలో నెగ్గడం నేర్చుకోవాలని ఉద్భోదించారు.కాలం కలిసి రానప్పుడు కొన్ని అనర్తాలు జరుగుతాయని అవి నేరాలు చేయడానికి కారణం కారాదని అన్నారు.విబేధాలు,వివాదాలు లేని సమాజం లేదని అవన్నీ చట్ట పరిధిలో పరిష్కరించుకునే వీలున్నవేనని వివరించారు.మార్గలెన్ని ఉన్న రాజీమార్గానిక మించిన మార్గమే లేదని జడ్జి దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం న్యాయసేవ సంస్థ కార్యక్రమాలకు తోడుగా నిలుస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.నిరంతర జాగరుకతతో ఉండి జీవిస్తూ నేరమయ సంస్కృతిని రూపుమాపడానికి తోడ్పాటునందించించాలని డీసీపీ బస్వారెడ్డి కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ అందరికి ఊయోగపడే జాతీయ లోక్ అదాలాత్ విజయంలో న్యాయవాదుల పాత్ర గణనీయమని తెలిపారు.జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ ప్రసంగిస్తు జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా లక్ష్య సాధనలో జిల్లా న్యాయసేవ సంస్థ ముందు వరుసలో ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, చైతన్య, హరి కుమార్,శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తదితరులు పాల్గొన్నారు.

. . . అన్నదమ్ములు, ఆలుమగల మధ్య వివాదాలు క్షేమకరం కాదు – జడ్జి హరి కుమార్
రక్తసంబంధం ఉన్న అన్నదమ్ముల మధ్యన, భార్యభర్తల మధ్యన నేర విచారణ దశలో ఉన్న రెండు క్రిమినల్ కేసులను రాజీపద్ధతిన జాతీయ లోక్ అదాలాత్ లో పరిష్కరించిన జూనియర్ సివిల్ జడ్జి వడ్డి హరి కుమార్ వారినుద్దేశించి పలు సూచనలు చేసి హితబోధ చేశారు. తన కోర్టుకు పలుసార్లు కేసు వాయిదాలకు వచ్చినప్పుడు చెప్పిన మంచిమాటలు విని ఒక పరిష్కారం దిశగా అడుగులు వేసిన ఇరుపక్షాలకు జడ్జి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్తిపాస్తులకంటే రక్తసంబంధమే గొప్పదని కేసులు పెట్టుకున్న అన్నదమ్ములకు వారి కుమారులకు ఎరుక జేశారు. కట్టుకున్న భార్యను,కన్న కూతురును కంటికి రెప్పలా కాపాడుకోవలసిన వాడు కాదుపొమ్మంటే ఎలా అంటు సర్దిచెప్పి బిడ్డ పేరున ఒక ఎకరం వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ గా చేసి ఇవ్వడం ముదావాహమని జడ్జి అభినందనలు తెలియజేశారు. రెండు కేసులను జారీపద్ధతిన పరిష్కరిస్తూ అవార్డులు జారీ చేశారు.రెండు కేసులు మానవీయ కోణంలో పరిష్కరించి కక్షిదారులను ఒప్పించిన తీరుపట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
