నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రెసిడెన్సీ హై స్కూల్ విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ అనే గ్లోబల్ పోటీలో పాల్గొని, ప్రతిష్టాత్మకమైన “యంగర్ హానరబుల్ మెన్షన్ ” పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులు రూపొందించిన “AURA” ప్రాజెక్టుకు నాసా నుండి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ విజయాన్ని జి.రిత్విక్ విరాట్ , శిండే సాయి గణేశ్, ఏ. ఈశ్వర్ రెడ్డి, ఉషం నోవా ఫిలేమాన్, మిథిలేశ్ మహాజన్ అనే విద్యార్థులు సాధించారు. విద్యార్థుల కఠిన ప్రయత్నం, గురువుల ప్రోత్సాహం, పాఠశాల నిర్వహణ మండలి సహాయం ఈ విజయానికి ప్రధాన కారణం. ప్రెసిడెన్సీ హై స్కూల్ తమ విద్యార్థులకు ప్రగతి సాధనలో సహకరిస్తూ, ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ముందుండి ప్రోత్సహిస్తుందని ప్రకటించింది. ఈ గొప్ప విజయంపై పాఠశాల చైర్మన్ నల్ల శమంత రెడ్డి, ప్రిన్సిపల్ పవన కుమార్ విద్యార్ధులను, ఉపాధ్యాయులను అభినందించారు. “AURA” ప్రాజెక్ట్ ద్వారా, విద్యార్థులు భవిష్యత్తులో అంతరిక్ష నివాస వ్యస్థలపై గొప్ప పరిశోధనలు చేసే అవకాశం పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

