ప్రెసిడెన్సీ హై స్కూల్ విద్యార్థులకు నాసా ప్రతిష్టాత్మక గౌరవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రెసిడెన్సీ హై స్కూల్ విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ అనే గ్లోబల్ పోటీలో పాల్గొని, ప్రతిష్టాత్మకమైన "యంగర్ హానరబుల్ మెన్షన్ " పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులు రూపొందించిన "AURA" ప్రాజెక్టుకు నాసా నుండి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ విజయాన్ని జి.రిత్విక్ విరాట్ , శిండే సాయి గణేశ్,  ఏ. ఈశ్వర్ రెడ్డి, ఉషం నోవా ఫిలేమాన్, మిథిలేశ్ మహాజన్ అనే విద్యార్థులు సాధించారు. విద్యార్థుల కఠిన ప్రయత్నం, గురువుల ప్రోత్సాహం, పాఠశాల నిర్వహణ మండలి సహాయం...