25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంజనీరింగ్ లో 319 ర్యాంక్ సాదించిన నారాయణ కాలేజీ విద్యార్థి రియా

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ఎప్ సెట్ -2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి  పంచమహల్కర్ రియా 319 ర్యాంకు సాధించి జిల్లాలో  మొదటి స్థానంలో  నిలవడం అనేది  జిల్లా కి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి ,కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. ఆదివారం ప్రకటించిన ఎప్ సెట్ లో ఇంజనీరింగ్ విభాగంలో రియాకు 319 వ ర్యాంకు , అగ్రికల్చర్ విభాగంలో వేముల పల్లి హర్షిత్ 1314, తుమ్మల నిహాల్ 2553, అంబటి శర్వాని 3029 , మాధవి నాగ శ్రావ్య 4273 , లవంగ వైష్ణవి 5082 , గొల్ల సాహిత్య 5429, కత్తి నిఖిల్ కుమార్ 8432, ఆకుల సుహాస్ 8537 రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సంధర్బంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి సత్కారించారు.పదివేల లోపు 10 ర్యాంకులు , 20వేల లోపు 26  ర్యాంకులతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని తెలిపారు. 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాలలోను 99.83 లాంటి జిల్లాలో అత్యధిక పర్సంటేల్ సాధించి వరుసగా రెండవ సంవత్సరం నారాయణ కాలేజీ విద్యార్థులు విజయ పథంలో నిలిచారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మరియు బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు అన్నారు. జెఈఈ,ఎంసెట్,ఐఐటి,నీట్ లాంటి ఏ పోటీ పరీక్షలలో నారాయణ కళాశాల నిజామాబాద్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఎం శేఖర్, నారాయణ విద్యాసంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు , కోర్ డీన్ వీరాంజనేయ ప్రసాద్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సాప్ట్ వేర్ సంస్థను నెలకోల్పడం నా ఆశయం…. పంచ మహల్కర్ రియా

ఇంటర్మీడియట్ లో  రాష్ట్రస్థాయి మార్కులు వచ్చినప్పుడే ఇంజనీరింగ్ లో స్టేట్ ర్యాంక్ ఖాయం అనుకున్నా. తల్లిధండ్రులు ఇద్ధరు వైధ్యులుగా నా చదువు విషయంలో ప్రోత్సహించారు. నారాయణ కళాశాలలో బోదన వలనే ర్యాంక్ సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ సంస్థను నెలకోల్పడం నా ఆశయం.

 

 

 

More articles

Latest article