24.1 C
Hyderabad
Monday, August 3, 2026

నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల నాయకులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను మోసం చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఆందోళన నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్ మూసివేశారు. ఈ సందర్భంగా వారు బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్ మాట్లాడుతూ నారాయణ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేవని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారని తెలిపారు. కానీ విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు సైతం పట్టించుకోకుండా నారాయణ యజమాన్యం ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేస్తూ విద్యార్థుల నుండి అడ్మిషన్ పేరుతోనే పుస్తకాల పేరుతోనే  పాఠశాల ఫిజుతో వేలాది రూపాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారని అన్నారు. నిబంధన విరుద్ధంగా నడుపుతున్న నారాయణ పాఠశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్యార్థులను చేర్పించద్దని విద్యార్థి సంఘాలుగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్, స్టాలిన్, మణికంఠ, రాహుల్, హరి, శివ కృష్ణ,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Narayana School should be closed immediately

More articles

Latest article