ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంలో నారాయణ ఒలింపియాడ్ బ్రాంచ్ ను విద్యాసంస్థల డైరెక్టర్ రమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్య సంస్థల్లో ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ఉత్తమ ఫలితాలను రాబట్టడంలో నారాయణ విద్యాసంస్థలు ఎల్లపుడు మొదటి స్థానంలో ఉంటుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమం లో నిజమాబాద్ జోన్ ఏజీఎం శివాజీతో పాటు జీఎం, డీజీఎం, ఎజీఎం, హెచ్ ఆర్, ఆర్ డి హెడ్స్, జెడ్ సీవో, ప్రిన్సిపాల్స్, డీన్స్, విఐపిలు ప ల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఇధి ప్రతి గ్రామల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శివాజీ పటేల్ మాట్లాడుతూ ఆర్మూర్ లో ఒలింపియాడ్ ప్రారంభించడం నిజమాబాద్ జిల్లాకే శుభపరిణామమని అన్నారు.

