24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలన్నింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుని అధ్యక్ష పీఠం దక్కించుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాన్సువాడ మున్సిపల్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. బాన్సువాడ పట్టణ అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని, రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్​పై దుష్ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 19 వార్డులను కైవసం చేసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్,నాయకులు అంజిరెడ్డి, రత్నకుమార్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, మోచి గణేష్, సాయిబాబా, బోడ చందర్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article