అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకోవాలి

. . . మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలన్నింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుని అధ్యక్ష పీఠం దక్కించుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాన్సువాడ మున్సిపల్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. బాన్సువాడ పట్టణ అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని, రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని...