30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సుతిల్ తో గొంతుకు ఉరి బిగించి హత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పరిధిలో శుక్రవారం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శనివారం రైల్వేస్టేషన్ ప్రాంతంలో కిరాణా దుకాణం  నిర్వహిస్తున్నశ్రీనివాస్ తన షాప్ ముందు గుర్తు తెలయని వ్యక్తి డెడ్ బాడి ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు బట్ట, సుతిల్ తో ఉరి బిగించి ఊపిరిఆడకుండా చేసి హత్య చేసినట్లు గుర్తించారు. హతుడు బిక్షాటన చేసి జీవిస్తున్నాడని, అతన్ని ముస్లీంగా గుర్తించినట్లు తెలిపారు. అతని వద్ద ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఆధారాల కోసం డెడ్ బాడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసిన వారు 1వ టౌన్ లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురిలో సంప్రదించాలని కోరారు.

More articles

Latest article