- వరద బాధితులకు ఫౌండేషన్ తరఫున సాయం
బతుకమ్మ, బోధన్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని పట్టణ, మండలాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రముఖ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శాలువాలతో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన నిర్విరామ కృషిని కొనియాడుతూ పలువురు నాయకులు ప్రసంగించారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, జన్మదినాన్ని హంగు ఆర్భాటాలతో కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్లు పంపిణీ చేయాలంటూ పార్టీ శ్రేణులను కోరినట్టు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పడిన వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎంపీఆర్ ఫౌండేషన్ తరఫున 1500 బ్యాగుల నిత్యవసర సరుకులను నాలుగు మండలాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. నాలుగు వాహనాల ద్వారా ఈ సరుకులు పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ప్రజల అవసరాలపై చురుకైన స్పందనతో ఉండే నాయకుడిగా ప్రకాష్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. జన్మదిన వేడుకలను ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మార్గనిర్దేశం చేయడంలో ఆయన చూపిన దృక్పథం పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచింది.

