. . . కేంద్రీయ విద్యాలయం స్థలం సాధన కోసం
. . . మే 18న ఒక రోజు నిరాహార దీక్ష
జగిత్యాల, బతుకమ్మ :
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రం నిధుల ద్వారా జరిగే పనుల విషయంలో, తాను ప్రజలకు ఇచ్చిన హమీల అమలు కోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంత నిక్కచ్చిగా ఉంటారో అందరికి తెలిసిందే. రైల్వే ప్రాజేక్టులు (కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, గూడ్స్ షేడ్ల నిర్మాణంతో పాటు, ఆర్ ఓబిలు, కొత్తగా రైళ్ల రాకపోకలను పెంచడం) కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కావచ్చు. ఇక విద్యాలయాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్ ల పరిధిలో లేనన్ని కేంద్రీయ విద్యాలయాలతో పాటు, జవహర్ నవోధయ విద్యాలయాలను కేటాయించడంలో సఫలం అయ్యారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నిధులు మంజూరు చేయించుకున్న ఘనత కూడగట్టుకున్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హమీ కొరకు తన పదవిని త్యజించుతానని బాండ్ పేపర్ రాసిచ్చి ఏకంగా దేశ ప్రదాని మోడిని మెప్పించి ఆయన్నే రప్పించి పసుపు బోర్డును తెచ్చిన రికార్డ్ ఉంది. జగిత్యాల జిల్లాకు కేంద్రం కేటాయించిన కేంద్రీయ విద్యాలయం స్థలంకై ఏకంగా ఒక్కరోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. గతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ ఓబిలకు రాష్ట్ర నిధులు కేటాయింపులో నిర్లక్ష్యంపై ఒక్కరోజు దీక్షకే ప్రభుత్వం దిగి వచ్చి నిధులను ఇచ్చింది. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి చేపట్టనున్న ధర్మ దీక్ష పార్లమెంట్ సెగ్మెంట్ లో సెగలు పుట్టిస్తుంది…

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ధర్మదిక్ష చేపట్టానున్నారు. కేవి మంజూరు జరిగి ఎనిమిది నెలలు గడిచిన ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం, తాత్కాలిక తరగతులకు భవనం కేటాయింపులో నిర్లక్ష్యం పై ఈ నెల 18న జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యలయం చౌరస్థాలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ మాసంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అంగీకరించింది. అందుకు స్థానికంగా జిల్లా కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం కేవిల కు స్థలం కేటాయించడంతో పాటు తాత్కలికంగా తరగతుల నిర్వహణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా కేంద్రీయ విద్యాలయం నిర్మాణంకు ముందుగా చలగల్ శివారులొ స్థల సేకరణకు సిద్ధమయ్యారు. కానీ స్థానికంగా నేతలు కేవిని చలగల్ శివారులో కాకుండా ఇతర ప్రాంతాలలో ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎనిమిది నెలలు గడిచిన ఇప్పటికి స్థల సేకరణ చేపట్టకపోవడంతో పాటు తాత్కాలిక భవనం కేటాయించకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరంను స్థానిక జిల్లా విద్యార్ధులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. స్థల సేకరణలో జాప్యం, తాత్కాలిక భవనం కేటాయింపు నిర్లక్ష్యంపై ఎంపి అరవింద్ జిల్లా అధికార యంత్రాంగంలో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక నాయకులను కలిసిన ప్రయోజనం లేకపోయింది. ఒక్కరిద్దరు నాయకుల స్వార్థం కారణంగా జగిత్యాల జిల్లాకు కేటాయించిన కేవి కి స్థల సేకరణ పై సంధిగ్ధం విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అర్వింద్ ధర్మపురి ఒక రోజు నిరాహార దీక్షకు పునుకున్నారు. స్థానిక నాయకుల రాజకీయ స్వార్థం కారణంగా కనీసం టెంపరరీ భవనం (అద్ధే) కు కేటాయించకపోవడంతో సిబిఎస్ఇ విద్యా విదానంలో దాదాపు 200 మంది విద్యార్ధుల అడ్మిషన్ లు లేక 1 వ తరగతి నుంచి 5 వరకు మంజురు కావాల్సిన విద్యాసంస్థ ప్రారంభం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల తీరును ఎండగడుతు, కేంద్రీయ విద్యాలయం సాధనకు ఎంపీ అరవింద్ చేపట్టనున్న దీక్షకు ప్రజల మద్దతు పెరుగుతుంది. జగిత్యాల జిల్లాలో కేంద్ర విద్యాసంస్థలు మంజూరు జరిగిన స్థలం కేటాయింపులో నిరక్ష్య దోరణికి చరమగీతం పాడాలని డిసైడ్ అయి ఎంపి చేపడుతున్న ధర్మదీక్షకు విద్యార్ధుల తల్లిదండ్రులు, మేధావులు స్వాగతిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు ఉచితంగా సిబిఎస్ఇ బోధన జరిపే పాఠశాల ఏర్పాటుకు స్థల కేటాయింపులో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు రచ్చకేక్కింది. కేంద్రం మంజూరు చేసిన విద్యా సంస్థ కు స్థల కేటాయింపులో అధికార పార్టీ ఇప్పుడు బోనులో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకోంది. ఈ నెల 18 వరకు ప్రభుత్వం దిగివస్తుందా లేక ధర్మదీక్ష జరుగుతుందా అనే టేన్షన్ మొదలైంది..